

మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు
MEGA DIGITAL NEWS :మిర్యాలగూడ పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా, ఆనందదాయకంగా జరుపుకోవాలని పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈనెల 31న మిర్యాలగూడ పట్టణంలోని వివిధ జంక్షన్లలో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తామని, డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, ఎవరు కూడా అనుమతి లేకుండా సౌండ్ బాక్సులు కూడా పెట్టవద్దని మరియు కారణం లేకుండా ఆకారణంగా పట్టణ రోడ్ల పై మోటార్ సైకిల్ లకు సైలెన్సర్ తీసివేసి, అధిక శబ్దాలు చేస్తూ తిరుగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేయవద్దని మరియు బాణాసంచా కూడా కాల్చవద్దని ప్రజలకు తెలియజేస్తున్నాము. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము.👍